Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని వీడిన మూడో మంత్రి ధరమ్‌సింగ్ సైనీ
- ఒక్కరోజే నలుగురు రాజీనామా
- కమలం పార్టీలో అంతర్మథనం
కాన్పూర్/లక్నో: యూపీ ఎన్నికల ప్రకటన తర్వాత బీజేపీకి దెబ్బమీద దెబ్బపడుతోంది. ఒక్కొక్కరుగామంత్రులు, ఎమ్మెల్యే లు రాజీనామాలు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నానికి మరో మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. ఒక్కరోజులో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఇందులో మంత్రి ధరమ్ సింగ్ సైనీ, ఎమ్మెల్యే ముకేశ్ వర్మ, వినరు షాక్యా, బాల ప్రసాద్ అవస్తీ ఉన్నారు. ముకేశ్ వర్మ షికోహాబాద్ ఎమ్మెల్యేగా ఉండగా, వినరు షాక్యా ఒరైయాలోని బిదునా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ధరమ్ సింగ్ సైనీ, ముకేశ్ వర్మ, వినరు షాక్యా వేర్వేరుగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అఖిలేశ్‌ను కలిశారు. అంతకుముందు యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్ రాజీనామాలు సమర్పించారు. ఈ లెక్కన గత మూడు రోజుల్లో ముగ్గురు మంత్రులు బీజేపీకి రాజీనామా చేశారు. అలాగే మొత్తం మీద ఇప్పటివరకు 14 మంది ఎమ్మెల్యేలు (మంత్రులతో సహా) పార్టీని వీడారు.అఖిలేశ్ యాదవ్‌తో ధరమ్ సింగ్ సైనీ భేటీ అయ్యారు. అనంతరం ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మాట్లాడుతూ- సామాజిక
న్యాయం కోసం పోరాడే మరో యోధుడు డాక్టర్ ధరమ్ సింగ్ సైనీ రాకతో సానుకూల, ప్రగతిశీల రాజకీయాలకు మరింత బలం చేకూరింది.అంటూ పార్టీలోకి స్వాగతం పలికారు.
యూపీ బీజేపీలో ముసలం..
యూపీ బీజేపీ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఓవైపు సంకీర్ణ భాగస్వామ్యులైన అప్నాదళ్ (ఎస్)పార్టీ డజనుకు పైగా సీట్లు కేటాయించాలని ఒత్తిడిపెంచుతోంది. మరోవైపు మంత్రులు,ఎమ్మెలేలు ఇస్తున్న ఝలక్‌లతో కమలంపార్టీ పరిస్థితి కక్కలేకమింగలేని పరిస్థితిలా తయారైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మోడీ..ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆయా జిల్లాల పర్యటనలు పూర్తి చేసుకున్న విషయం విదితమే. 235 సీట్లు వస్తాయని బీజేపీ అంచనా వేసుకున్నది. ఈలోపు ఊహించనివిధంగా ఇప్పటికే డజనుపైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని మారటానికి సిద్ధంగా ఉన్నట్టు లీకులు వస్తున్నాయి. దీంతో సీఎం యోగి రంగంలోకి దిగి..ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కేస్తున్నారు. 80 శాతం..20 శాతం మధ్య పోటీ అంటూ హిందూ ముస్లింల ఓట్లను గురించి పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే..యూపీలో బీజేపీ జబరస్త్ ఒత్తిడిలో ఉన్నదని స్పష్టమవుతోంది.మోడీ ఏదీ చేసినా మాస్టర్‌స్ట్రోక్ అంటూ గోడీ మీడియా హైలెట్ చేస్తున్నది. కానీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎస్పీలోకి చేరుతుంటే..మాత్రం దాని జోలికి వెళ్లటంలేదు.గతంలో భయపెట్టో,బెదిరించో బీజేపీ చేర్చుకున్న నాయకులు..ఇపుడు గడ్డుపరిస్థితులను ఊహించి మంత్రి, ఎమ్మెల్యే పదవులను వదలుకోవటానికి సిద్ధపడుతున్నారు. వాస్తవంగా యూపీలోని యోగి జమానాలో ఠాకూర్ల జంగిల్ రాజ్ నడుస్తోంది. హత్రాస్‌లోనూ గుడియాపై దుష్కర్యం , హత్య జరిగాక..ఆ దారుణంలో ప్రమేయం ఉన్నవారిని కాపాడటానికి యోగి సర్కార్ ఎంతటి అనర్థాలకు పాల్పడిందో..అందరికి తెలిసిందే. యూపీలో దళితులు, మైనార్టీల పై వేధింపులకు ఎక్కువయ్యాయి. ఎన్సీఆర్బీ రిపోర్టుల్లోనూ ఘోరాలు,నేరాల్లో యూపీ ప్రధమ స్థానంలో ఉన్నదని ధ్రువీకరించింది.ఇలాంటి పరిస్థితుల్లో ఆయా వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు..బీజేపీని వీడుతుంటే..
మాఫియా, నేరగాళ్లు..వదిలిన వాళ్లంతా...ముద్రవేయటానికి ఆ పార్టీ నానా తంటాలు పడుతోంది. ఆ విషయాలను మాత్రమే మీడియాలో హైలెట్ చేస్తోంది.అవకాశవాదం..పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ..రాజకీయం కార్పొరేట్ మీడియా విష ప్రచారం చేస్తోంది.తమ పార్టీలో తప్పులున్నా చేర్చుకున్నా బీజేపీ చేస్తున్న ఆరోపణలు నేతిబీరకాయలాంటివని ప్రతిపక్షాలు తిప్పికొడుతున్నాయి. మొత్తం మీద యూపీ రాజకీయాల్లో సమీకరణలు వేగంగా మారుతుంటే..ఓటరు నాడీ ఎటు అన్న చర్చ నడుస్తున్నది.
ఇప్పటి వరకు బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యేలు..నియోజవర్గాలు
పేరు నియోజకవర్గం
స్వామి ప్రసాద్ మౌర్య పద్రౌన కుషినగర్
ధరమ్ సింగ్ సైనీ నకుడ్ సహరన్పూర్
భగవతీ సాగర్ బిల్హౌర్
రోషన్‌లాల్ వర్మ తిల్హార్
వినరు శక్య బిధునా ఔరయా
అవతార్ సింగ్ భదన మీరాపూర్
దారా సింగ్ చౌహాన్ మధుబన్ మౌ
బ్రిజేష్ ప్రజాపతి తింద్వారి బండ
ముకేశ్ వర్మ షికోహాబాద్ ఫిరోజాబాద్
దిగ్విజరు నారాయణ్ జై చౌబే ఖలీలాబాద్
బాల ప్రసాద్ అవస్థి ధౌర్హర లఖింపూర్
రాకేష్ రాథోడ్ సీతాపూర్
మాధురి వర్మ నాన్పరా బహ్రైచ్
ఆర్కే శర్మ బిల్సి బదౌన్