మదురై : తమిళనాడులో జల్లికట్టు ఉత్సాహంగా సాగుతోంది. మధురైలోని అవనియపురంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సాంప్రదాయ క్రీడలో పాల్గనేందుకు ప్రతీ ఏటా జరిగినట్లే ఈసారి కూడా అనేకమంది పాల్గొన్నారు. అయితే శుక్రవారం నిర్వహించిన జల్లికట్టులో సుమారు 48మంది గాయపడినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పోటీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.