Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 17,87,457 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2.64లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోలిస్తే.. 6.7 శాతం అదనం. అదేవిధంగా 315 మంది మరణించారు. మహమ్మారి దశ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య.. 3.63 కోట్లకు చేరుకోగా, కరోనాకు బలైన వారు 4,85, 350 మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 5,753కి పెరిగాయి.
డెల్టా వేరియంట్‌తో 2.40 లక్షల మందికి పైగా మృతి.. ఐరాస నివేదిక
గత ఏడాది ఉద్భవించిన డెల్టావేరియంట్ .. భారత్‌లో భారీగా ప్రాణాలను బలిగొంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో 2,40,000 మంది ప్రాణాలను బలిగొందని తెలిపింది. 'ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్టర్ 2022' పేరుతో ఈ నివేదిక విడుదలైంది. ఆర్థిక పునరుజ్జీవంపై డెల్టా వేరియంట్ భారీ దెబ్బ కొట్టిందని పేర్కొంది. సమీప భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావచ్చని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్త టీకా కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టనంత వరకూ... మహమ్మారి సవాళ్లు విసురుతూనే ఉంటుందని పేర్కొంది.