Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలో నన్‌పై లైంగికదాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ నిర్దోషిగా కొట్టాయం కోర్టు ప్రకటించింది. ఈ మేరు 2018లో జలంధర్ డియోసెస్ పరిధిలోని ఒక నన్ 2014 నుంచి 2016 మధ్యకాలంలో బిషప్ ఫ్రాంకో తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడంటూ ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు బిషప్ ఫ్రాంకోని అరెస్టుచేశారు. పోలీ సులు, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నన్‌లు వీధు ల్లో కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ చేశారు.ఆ తర్వాత సుమారు 100రోజులకు పైగా సాగిన విచారణ తర్వాత కోర్టు అతన్ని అన్ని అభియోగాల నుంచి విముక్తి చేసింది.