Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు
లక్నో : ఇక సైకిల్ (సమాజ్‌వాదీ గుర్తు)ను ఎవరూ ఆపలేరని అందరూ ఐకమత్యంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లు గెలవడం ఖాయమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సైకిల్ హ్యాండిల్ బాగుందని, రెండు చక్రాలు కూడా సరిగ్గానే ఉన్నాయని, ఫైడల్ తొక్కే వ్యక్తి కూడా వచ్చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఇటీవలే గుడ్‌బై చెప్పిన ప్రసాద్ స్వామి మౌర్య, ధరంసింగ్‌తో సహా ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం అఖిలేష్ సమక్షంలో సమాజ్‌వాదీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అఖిలేష్ మాట్లాడారు. యూపీని బీజేపీ ప్రభుత్వం మొత్తం దివాళా తీయించిందని మండిపడ్డారు. తాను ఏ పార్టీలోకి వెళితే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని స్వామి మౌర్య అన్నారని, వచ్చేసారి సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ మకర సంక్రాంతి తర్వాత బీజేపీ పని అయిపోయిందని మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య విమర్శించారు.
టికెట్ రాలేదని బిఎస్పీ నేత కన్నీరు
ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుంచి టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు అర్షద్ రాణా మీడియా ముందు ఏడుస్తూ కనిపించాడు. రెండేండ్ల క్రితం పార్టీ సీనియర్ నాయ కుడు టికెట్ కోసం రూ.67 లక్షలు డిమాండ్చేశాడని, అయితే తనకు తెలియకుం డానే తనటికెట్ తొలగించారని అర్షద్ రాణా పోలీసుల ముందు ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు.