Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్లో 13 శాతం పతనం
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే వాహన పరిశ్రమలో బలహీన సంకేతాలు నెలకొన్నట్టు స్పష్టమవుతోంది. 2021 డిసెంబర్లో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 13 శాతం క్షీణించి ఐదేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. చిప్‌ల కొరతకు తోడు మార్కెట్లోనూ డిమాండ్ లేకపోవడంతో గడిచిన మాసంలో ఈ వాహన అమ్మకాలు 2,19,421 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020 ఇదే మాసంలో 2,52,998 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (సీయోమ్) గణంకాల ప్రకారం.. గత మాసంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 11 శాతం క్షీణించి 10,06,062 యూనిట్లు కాగా, మోటార్ సైకిల్ అమ్మకాల్లో 2 శాతం, స్కూటర్ విక్రయాల్లో 24 శాతం చొప్పున క్షీణించాయి. కాగా.. వాణిజ్య వాహనాల అమ్మకాలు స్వల్పంగా పెరిగి 1,94,712 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో అన్ని కేటగిరీల వాహనాలు స్థూలంగా 22 శాతం క్షీణించి 46,36,549 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 59,46,283 యూనిట్లుగా నమోదయ్యాయి.