Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : పశ్చిమ బెంగాల్లో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. రాష్ట్రంలోని జల్పాయిÛగురిలో గురువారం సాయంత్రం భారీ రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని బికనీర్ నుంచి అసోంలోని గౌహతి వెళుతున్న బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ దోమోహని సమీపంలోని మోనోగురి వద్ద పట్టాలు తప్పింది. ఏకంగా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్టు జల్పారుగురి జిల్లా కలెక్టర్ మౌమిత గొడార శుక్రవారం తెలిపారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలున్నట్టు చెప్పారు. తీవ్రంగా గాయపడిన 36 మంది వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
సాంకేతిక లోపమే కారణం : రైల్వే మంత్రి
బెంగాల్ రైలు ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని శుక్రవారం మంత్రి సందర్శించారు. లోకోమోటివ్లో సాంకేతిక లోపం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయిందని మంత్రి తెలిపారు. 'లోకోమోటివ్లో కొన్ని భాగాల్లో సాంకేతిక లోపం ఉన్నట్లు తెలుస్తోంది. దానిని పూర్తిగా విడదీసి పరిశీలించాలి' అని మంత్రి తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభించినట్లు చెప్పారు.
మరోవైపు, ప్రాధమిక సమాచారం ప్రకారం 12 కోచ్లు పట్టాలు తప్పాయని, ఇందులో రెండు బోల్తా పడ్డాయని ఎన్.ఎఫ్ రైల్వే ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాద సమయంలో రైలులో 1053 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం ఉదయానికి ప్రమాద స్థలం నుంచి ప్రయాణీకులందరీని తొలగించామని, ట్రాక్ పనులు కొనసాగుతున్నాయని ప్రకటనలో తెలిపింది.
రెడ్ వాలంటీర్ల రక్తదానం
ఘోర రైలు ప్రమాదం వార్త తెలిసిన వెంటనే సీపీఐ(ఎం)కు చెందిన రెడ్ వాలంటీర్లు స్పందించారు. రైలు ప్రమాద బాధితులకు రెడ్ వాలంటీర్లు అండగా నిలుస్తున్నారు.
అలాగే, తీవ్రగాయలతో బాధపడుతున్న వారికి రక్తం అత్యవసరం కావడంతో అత్యవసర ప్రాతిపదికన రక్తదానం చేసేందుకు వందలాది మంది రెడ్ వాలంటీర్లు ముందుకు వచ్చారు. రక్తదానం కోసం ఆస్పత్రుల ముందు బారులు తీరారు.