Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్-19పై కేంద్రం, రాష్ట్రాలకు నిపుణుల లేఖ
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్నది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. అన్నింటికీ మించి ఒమిక్రాన్ కేసుల సంఖ్య తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. అయితే, కరోనా మహమ్మారిపై నిపుణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. గతేడాది జరిగిన తప్పులను నివారించాలని సూచించారు. అలాగే, సాక్ష్యాల ఆధారంగానే కోవిడ్-19 కేసులపై స్పందించాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఆరోగ్య కార్యకర్తలు, వైద్య పరిశోధకులు, ప్రజారోగ్య నిపుణులు లేఖ రాశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 2.64 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 315 మరణాలు రికార్డయ్యాయి. పాజిటివిటీ రేటు 14.78 శాతంగా ఉన్నది. వేగవంతమైన పరీక్ష, నిర్బంధం, ఐసోలేషన్, స్థానిక భాషలలో హౌమ్కేర్ మార్గదర్శకాలను ప్రచురించాలని కోరారు.