Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశాన్యంలో తగ్గిన అటవీ విస్తీర్ణం
న్యూఢిల్లీ : భారత్‌లో అడవులు క్షీణిస్తున్నాయి. 2021లో భారత్‌లో అటవీ విస్తీర్ణం ఎనిమిదేండ్ల కనిష్టానికి చేరుకుంది. 2019తో పోల్చుకుంటే 0.22 శాతం పెరిగినప్పటికీ.. 2013లో 0.85 శాతం, 2017తో 0.94 శాతంతో పోలిస్తే తగ్గింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ద్వై వార్షిక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) 2021 ప్రకారం.. 2019 కన్నా అటవీ ప్రాంతంలోని భూమి కేవలం 1,540 చదరపు కిలోమీటర్లు పెరిగింది. అదేవిధంగా 2019 కంటే 2021లో చెట్ల విస్తీర్ణం పెరుగుదల 0.76 శాతంగా ఉండగా.. 2015 నుండి అత్యల్ప రేటు. 2021 ప్రకారం... మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం దేశంలోని భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతంగా ఉంది.ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన, ప్రత్యేకమైన జీవ వైవిధ్యానికి ఆధిత్యమిస్తోన్న ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల జరుగుతోంది. దేశంలోనే నాగాలాండ్ అత్యధికంగా అటవీ విస్తీర్ణాన్ని కోల్పోతుంది. 2019 నుండి నాగాలాండ్‌లో 1.88 శాతం (235 చదరపు కిలోమీటర్ల మేర) అటవీ విస్తీర్ణం తగ్గింది. దీని తర్వాత మణిపూర్ 1.48 శాతం ( 249 చ.కిలో), మిజోరాం 1.03 శాతం, మేఘాలయ 0.48 శాతం కోల్పోయాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 0.39 శాతం (257 చ. కిలోమీటర్లు) మేర తగ్గింది. 2015 నుండి అటవీ విస్తీర్ణం పెరిగిన అసోంలో కూడా..2021లో15చదరపు కిలోమీటర్ల క్షీణతను చవిచూసి ంది. గత దశాబ్ద కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం చెప్పుకోదగ్గ పెరుగుదల నమోదు కాలేదు. మిజోరాం అన్నిటి కన్నా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. గత దశాబ్దంలో ఎటువంటి పెరుగుదల నమోదు చేయలేదు. మొత్తం మీద, 11రాష్ట్రాలు తమ అటవీ విస్తీర్ణంలో తగ్గుద లను చవిచూశాయి.వీటిలో ఢిల్లీ,పశ్చిమ బెంగాల్ కూడా ఉన్నాయి. ఇవి అటవీ విస్తీర్ణంలో ఈశాన్య రాష్ట్రాలను అనుసరిస్తు న్నాయి.ఇక చెట్ల విస్తీర్ణంలో కూడా ఇదే జరుగుతోంది.2019తో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలు చెట్ల విస్తీర్ణాన్ని కోల్పోవడాన్ని ముందు వరుసలో ఉన్నాయి.అగ్ని ప్రమాదాలు కూడా దీనికి దోహదం చేస్తున్నాయి. కేంద్ర పర్యావర ణం,అటవీ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఒఇఎఫ్‌సిసి).. దేశంలో మొత్తం అటవీ,చెట్ల విస్తీర్ణం 80.9మిలియన్ హెక్టార్లుగా ప్రకటించింది.ఇది దేశంలోని భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతం. 2019తో అంచనాతో పోలిస్తే, దేశంలోని మొత్తం అడ వులు మరియు చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే పెరుగుదల నమోదైంది.ప్రస్తుత అంచనాల ప్రకారం17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భౌగోళిక విస్తీర్ణంలో 33శాతానికి పైగా అటవీ విస్తీర్ణంలో ఉన్నాయని ఎంఒఇఎఫ్‌సిసి మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. అడవులను సంరక్షించడమే కాకుండా.. సుసంపన్నం చేసేందుకు దృష్టి సారిస్తామని అన్నారు. అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్రం చెబుతుం డగా.వాస్తవంగా తగ్గుతోందని స్వతంత్ర నివేదికలు పేర్కొంటున్నాయి. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, డ్యాష్ బోర్డ్ ప్రకారం.. 2002 నుండి 2020 వరకు, భారత్ భారీగా తేమతో కూడిన ప్రాధమిక అడవులను కోల్పోయిం ది.ఇదే సమయంలో19శాతం చెట్ల విస్తీర్ణం నష్టపోయింది.తేమతో కూడిన అటవీ వైశాల్యాన్ని3.4శాతం పడిపోయింది.