Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్‌కతా : అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కార్టునిస్టు నారాయణ్ దేవ్‌నాథ్‌కు ఆసుపత్రిలోనే పద్మశ్రీ అవార్డును అందచేశారు. పశ్చిమ బెంగాల్ సహకార శాఖ మంత్రి ఆరూప్ రారు, హోం శాఖ కార్యదర్శి బిపి గోపాలికా పద్మశ్రీ పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని దేవ్ నాథ్‌కు అందచేశారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నారాయణ్‌కు పద్మశ్రీ ప్రకటించింది. 97 ఏళ్ల దేవ్‌నాథ్ వృద్ధాప్య వ్యాధుల కారణంగా డిసెంబరు 24 నుంచి నగరంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నారాయణ్ సృష్టించిన 'బతుల్ ది గ్రేట్', 'నాంటే ఫాంటే' వంటి కాల్పనిక పాత్రలు విశేష ప్రాచుర్యం పొందాయి.