Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రులకు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) విక్రయాలను నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ యూనిట్‌ను నిర్వాహక, సాంకేతిక, నైపుణ్య సమర్థత లేని స్రయివేట్ సంస్థకు విక్రయించడం సమంజసం కాదని అన్నారు. సీఈఎల్ ఆస్తులు నందల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించబడుతున్న మొత్తం కంటే చాలా ఎక్కువని లేఖలో పేర్కొన్నారు. ''నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో సీఈఎల్ కలిగి ఉన్న 50 ఎకరాల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ (2019-20 సంవత్సరానికి సిఈఎల్ వార్షిక నివేదిక) రూ. 500 కోట్లకు మించి ఉంది. దాని ఆస్తులు ఏవైనా లీజు ప్రాతిపదికన ఉన్నప్పటికీ, మిగిలిన గడువు లేని లీజు కాలానికి దాని విలువ వందల కోట్లను పొందవచ్చు'' అని తెలిపారు. ''2019-20లో నందల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రయివేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఆర్థిక నివేదికల ప్రకారం, దాని ఈక్విటీలో 99.96 శాతం ప్రీమియర్ ఫర్నీచర్స్ అండ్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందినదని చెప్పబడింది. దీనికి వ్యాపారంతో సంబంధం లేదు. రక్షణ రంగంలో కూడా పరోక్షంగా ఫర్నీచర్ కంపెనీకి దోహదపడే వ్యూహాత్మక పిఎస్‌యుని విక్రయిం చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది'' అని బ్రిట్టాస్ తన లేఖలో పేర్కొన్నారు.