Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో కూంబింగ్‌కు వచ్చే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందు పాతర అమర్చారు. దాన్ని గమనించిన పోలీసులు చాకచక్యంగా నిర్వీర్యం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ప్రచారంలో భాగంగా జనవరి 14న డీఆర్జీ జవాన్ల బృందం హింగుమ్, కోట్మెటా, జార్మోంగియా దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహించింది. తిరుగు ప్రయాణంలో మత్వారా-బాచెలార్ రహదారి పక్కన ఉన్న వైర్‌ను పోలీసులు గమనించారు. సెర్చ్ ప్రొసీడింగ్స్‌లో, పోలీసు బలగాలకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో మావోయిస్టులు రోడ్డుపై ప్రెషర్ కుక్కర్లో ఐఈడీని అమర్చారు. డీఆర్జీ బృందం చాకచక్యంగా వ్యవహరించి ఐఈడీలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినట్టు ఎస్పీ కమలలోచన కశ్యప్ చెప్పారు. ఇదిలా ఉండగా నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చిన ఘటనలో ఓ జవానుకు తీవ్రగాయాలయ్యాయి.