Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేలుడు పదార్థాలు,ఆర్డీఎక్స్ స్వాధీనం
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. శుక్రవారం తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్లో ఒక బ్యాగ్‌లో పేలుడు పరికరం (ఐఈడీ)ని కనుగొన్నారు. దీంతో భద్రతా ఏజెన్సీలను ప్రభుత్వం హై అలర్ట్ చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు స్థానికులు బ్యాగ్‌లో అనుమానాస్పద ఐరన్ బాక్స్‌ను గుర్తించారు. వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 10.19 గంటలకు బ్యాగ్ గురించి తమకు సమాచారం అందిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాల్ అందిన అనంతరం అగ్నిమాపక యంత్రాన్ని ఘటనా స్థలానికి పంపించినట్టు వివరించారు. అది ఇనుప పెట్టె అని అధికారులు కనుగొన్నారు. ఎన్ఎస్జీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను కూడా పిలిచినట్టు అధికారి చెప్పారు. ఎన్ఎస్జీ బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ టీమ్ ఐఈడీని స్వాధీనం చేసుకున్నది. ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి మాట్లాడుతూ.. ఘాజీపూర్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఈడీ తయారీలో ఆర్డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్ వంటి రసాయన సమ్మేళనాలను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వివిధ సమూహాలకు చెందిన తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు.. భద్రతా దళాల క్యాంపస్, రద్దీగా ఉండే ప్రదేశాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మతపరమైన ప్రదేశాలు వంటి వాటిపై దాడికి సంబంధించి ఈనెల 7న ఒక నివేదిక వచ్చినట్టు సమాచారం.