Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మనకొక ఆశ్చర్యకరమైన విషయం. లింగమార్పిడి శస్త్రచికిత్సలకు కేంద్రంగా భారత్ మారుతోంది. ఈ శస్త్ర చికిత్సల కోసం గతంలో థాయిలాండ్ గమ్యస్థానంగా ఉండేది. ఫిలిఫీన్స్ కూడా హాట్‌స్పాట్‌గా ఉండేది. కానీ ఇకపై కాదు. ఈ శస్త్ర చికిత్సల కోసం భారత్‌కు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని ఇటీవల గణాంకాలు చెబుతున్నాయి.'సెక్స్ ఛేంజ్ టూరిజం'గా పేర్కొనే ఈ పరిశ్రమ దేశంలో ఆశ్చరకర రీతిలో అభివృద్ధి చెందుతోంది. ఈ శస్త్ర చికిత్సలు సులభతరంగా మారడంతో పాటు, పెద్ద వ్యాపారంగా మారాయి. దేశం ఇందులో ఎంతగా అభివృద్ధి చెందింతంటే ఢిల్లీలోని వీటికి కోసం ప్రత్యేకంగా ఒక ఆస్పత్రే ఏర్పాటైంది. ఢిల్లీలోని ఓల్మేక్ ట్రాన్స్‌జెండర్ సర్జరీ ఇనిస్ట్టిట్యూట్‌ను డాక్టర్ నరేంద్ర కౌశిక్ ఏర్పాటు చేశారు. కేవలం ట్రాన్స్ పేషెంట్ల కోసం దీనిని నిర్మించారు. ఇందులో ఏడాదికి కనీసం 1000 శస్త్రచికిత్సలు నిర్వహిస్తే.. ఇందులో 600 లింగమార్పిడి ఆపరేషన్లే.అంటే జననేంద్రియాలను మగ నుంచి స్త్రీకి లేదా స్త్రీ నుంచి మగకు మార్చడం. గత ఏడేండ్ల నుంచి గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని డాక్టర్ కౌశిక్ మీడియాకు తెలిపారు. కోవిడ్ సమయంలోనూ ఇది తగ్గలేదని ఆయన చెప్పడం విశేషం. అయితే ఈ శస్త్ర చికిత్సల కోసం ముందుగా అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ చికిత్స కోసం తమ వద్ద 30 వేల నుంచి 40 వేల డాలర్ల వరకూ మాత్రమే వ్యయమవుతుందని చెప్పారు. ఇదే చికిత్సలకు అమెరికాలో లక్ష డాలర్ల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుంచి ఎక్కువగా తమ వద్దకు వస్తుంటారని చెప్పారు.