Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోసం చేసిన బిఎస్ఎఫ్ అధికారి అరెస్టు
గుర్గావ్ : ఐపిఎస్ అధికారిగా నటిస్తూ ప్రజల్ని రూ.125 కోట్ల వరకూ మోసం చేసిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) అధికారిని హర్యానాలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.14 కోట్ల నగదు, కోటి విలువైన బంగారు ఆభరణాలు, ఒక బిఎండబ్ల్యూ-మెర్సిడెస్‌తో సహా ఏడు విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. గుర్గావ్ జిల్లాలోని మనేసర్ వద్ద ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎస్ఎస్జి) ప్రధాన కార్యాలయంలో బిఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌గా పని చేస్తున్న ప్రవీణ్ యాదవ్ ఐపిఎస్ అధికారిగా నటిస్తూ ప్రజల్ని మోసం చేసేవాడు. ఎన్ఎస్జి క్యాంపస్‌లో నిర్మాణ కాంట్రాక్టులు ఇపిస్తానని ప్రజల వద్ద నుంచి లంచాలు తీసుకునే వాడు. ఈ భారీ మొత్తాలను ఒక నకిలీ ఎన్ఎస్జి ఖాతాకు బదిలీ చేసేవాడు. యాక్సిస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉన్న అతని సోదరి రీతూ యాదవ్ ఈ నకిలీ ఖాతాను సృష్టించింది. ప్రవీణ్ యాదవ్ భార్య మమతా యాదవ్, సోదరి రీతూ యాదవ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.