Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నితీష్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
నలంద : బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సొంత జిల్లా నలందలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 11కి పెరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సొహసరారు పోలీస్ స్టేషన్ పరిధిలోని చ్చోటి పలారి, పహర్ తల్లి ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు దాదాపు 50 మంది శుక్రవారం కల్తీ మద్యం తాగారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత ఎనిమిదిమంది చనిపోగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. 2016 నుంచి రాష్ట్రంలో మద్యనిషేధం అమలవుతోంది. గత ఆరు నెలల్లో కల్తీ మద్యం తాగిన ఏడు సంఘటనల్లో 40 మందికిపైగా మరణించారు. దీంతో, కల్తీ మద్యం మరణాలకు బాధ్యత వహిస్తూ నితీష్‌కుమార్ రాజీనామా చేయాలని ఆర్జెడి అధికార ప్రతినిధి శక్తిసింగ్ యాదవ్ డిమాండ్ చేశారు.