Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్‌కు ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియా గుటెరస్ హజరుకానున్నారు. ఈ విషయాన్ని ఒక మీడియా సమావేశంలో గుటెరస్ స్వయంగా వెల్లడించారు. 'ఒలింపిక్ క్రీడలు చాలా ముఖ్యమైన వేడుకలు. అలాగే ప్రజలను ఒక చోట చేర్చడంలోనూ, శాంతిని పెంపొందించడంలోనూ క్రీడల పాత్రను సూచించే వేడుకలు' అని గుటెరెస్ చెప్పారు.'ఇలాంటి కఠినమైన సందర్భంలో ఎలాంటి రాజకీయ కోణం లేకుండా, ఒలింపిక్ క్రీడలు ప్రపంచంలో శాంతికి సాధనంగా ఉండాలనే సందేశంతో ప్రారంభోత్సవానికి హజరుకావాలని నేను భావిస్తున్నాను' అని తెలిపారు.