Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ మాత్రమే కాదు.. రాష్ట్రాలూ కీలకమే
- 'ఆర్థిక' చక్రానికి అవసరమయ్యే వనరులు రాష్ట్ర ప్రభుత్వాల వద్దే అధికం : జీడీపీ వృద్ధిపై
ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారత్ స్వాతంత్య్రం పొంది ఈ ఏడాదికి 75 ఏండ్లు గడుస్తుంది. ఈ తరుణంలో ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందిరి దృష్టి నెలకొన్నది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఊహాగానాలు, సూచనలు ఈ కార్యక్రమానికి ముందుంటాయి. అనంతరం అంచనాలకు అనుగుణంగా విశ్లేషణ, విమర్శలుంటాయి.అయితే, జీడీపీ వృద్ధిలో బడ్జెట్ ఒక్కటి మాత్రమే కీలకం కాదని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఇందులో రాష్ట్రాలూ ప్రధానమేననీ చెప్పారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన ప్రాథమిక సత్యం దేశ నిర్మాణంలో ఇమిడి ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 '' భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలి'' మరియు రాజకీయ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి ప్రభావవంతంగా అన్ని రాష్ట్రాల ఉత్పత్తి మొత్తం (ముఖ్యంగా రాష్ట్రాలు ఏమి చేయగలవో దాని ఫలితం సేకరించిన, కేటాయించిన వనరులతో) అయ్యి ఉండాలి. నిజానికి, ఆర్థిక ఉత్పత్తి చక్రానికి అవసరమయ్యే వనరులైన ఉద్యోగాలు, ఆదాయం, వినియోగం, పెట్టుబడి, వృద్ధిని సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఎక్కువగా ఉంటాయి. వాటి మధ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ( అభివృద్ధి, అభివృద్ధిచేతర వ్యయంలో) రూ. 64.70 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశాయి. ఇందులో రూ. 42.11 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. మిగిలిన మొత్తాన్ని కూడా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. కాబట్టి, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కాదనలేనిది. దేశంలో ఉన్న ఎన్నో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు దారి చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెనకబడిన తరగతుల మధ్య అసంతృప్తివకి కారణం ఆర్థికావకాశాల అసమానత. సామాజిక న్యాయం లేదా ఉద్యోగ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానాల ద్వారా మాత్రమే నిజమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి కోసం శ్రమను పెంచడానికి మూలధనం, అందుబాటులో ఉన్న భూ వనరులను ఎంతవరకు ఉపయోగించగలవు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. బీజేపీ ప్రస్తుతం దేశంలోని 18 రాష్ట్రాల్లో 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలను' నడుపుతున్న విషయం గమనించాల్సిన అంశం. అయితే, దేశ జీడీపీ, ఆర్థికాంశాల్లో పరివర్తన ఢిల్లీలో రూపొందించబడిన అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, కొన్ని ప్రధాన మార్పులు రాష్ట్రాలలో ఉద్భవించాయనీ, జీడీపీలో తమ మార్కును చూపెట్టాయని గత అంశాలను నిపుణులు గుర్తు చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన 'శ్వేత విప్లవం', తమిళనాడులో పుట్టిన మధ్యాహ్న భోజన పథకం, అక్షరాస్యత వేగం కోసం నమోదు ప్రక్రియ, 1970లలో మహారాష్ట్రలోని 'ఉపాధి హామీ పథకం' వంటి వాటిని ఉదహరించారు.