Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా 300 మందికి పైగా మృతి
- 2.71 లక్షల కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఐదో రోజూ మరణాల సంఖ్య 300 లకు పైనే నమోదైంది. శనివారం 2లక్షల 71 వేల 190 మందికి కొత్త కరోనా సోకింది. 1 లక్షా 38 వేల 201 మంది కోలుకోగా, 314 మంది మరణించారు. మరణాల సంఖ్య 300 దాటడం ఇది వరుసగా ఐదవరోజు. రెండు రోజుల్లో ఈ సంఖ్య 400 దాటింది. ఇప్పటివరకు, దేశ వ్యాప్తంగా మొత్తం 3.71 కోట్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్కు గురయ్యారు, వారిలో 3.50కోట్ల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,86,061 మంది మరణించారు.