Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన మోడీ సర్కార్
- లఖింపూర్ ఖేరీ ఊచకోతలో బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా శాశ్వత మోర్చా
- కొనసాగనున్న ''మిషన్ ఉత్తరప్రదేశ్''
- ఫిబ్రవరి 23, 24న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు ఎస్కేఎం మద్దతు
న్యూఢిల్లీ : రైతులకు మోడీ సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వ్యతిరేకంగా జనవరి 31న దేశవ్యాప్త ''విద్రోహ దినం (విరోధ్ దివస్)''గా నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ఊచకోత కేసులో బీజేపీ ఆకస్మిక వైఖరికి వ్యతిరేకంగా శాశ్వత మోర్చాను ఏర్పాటు చేయనున్నది. అలాగే ''మిషన్ ఉత్తరప్రదేశ్'' కొనసాగుతుందని ఎస్కేఎం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కార్మిక సంఘాలు ప్రకటించిన దేశవ్యాప్త సమ్మెకు ఎస్కేఎం మద్దతు నిస్తున్నట్టు తెలిపింది. సంయుక్త కిసాన్ మోర్చా పేరును ఎన్నికల్లో ఉపయోగించబడదనీ, ఎన్నికల్లో పాల్గొనే రైతు సంఘాలు, నాయకులు తమతో లేరని స్పష్టం చేసింది. ఢిల్లీలోని సింఘూ సరిహద్దులో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో ఎస్కేఎం కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యచరణకు సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఎస్కేఎం నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ (కాక్కాజీ), యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
''డిసెంబర్ 9న మేం సరిహద్దుల్లో ఆందోళనలు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న లేఖలోని వాగ్దానాలలో ఏ ఒక్క హామీని కూడా మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎస్కేఎం తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆందోళన సందర్భంగా కేసులను వెంటనే ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హర్యానా ప్రభుత్వం కేవలం పేపర్ వర్క్ మాత్రమే చేసింది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ కూడా అందలేదు. అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పరిహారానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎంఎస్పీ సమస్యపై కేంద్రప్రభుత్వం కమిటీ ఏర్పాటును ప్రకటించలేదు. కమిటీ స్వభావం, దాని ఆదేశం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రైతులకు చేస్తున్న ఈ ద్రోహానికి నిరసనగా జనవరి 31న దేశ వ్యాప్తంగా ద్రోహ దినాన్ని పాటించాలని, జిల్లా, బ్లాక్ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఎస్కేఎం నిర్ణయించింది'' అని పేర్కొన్నారు.
''లఖింపూర్ ఖేరీ హత్యాకాండలో యూపీ ప్రభుత్వం, బీజేపీ ప్రజా హక్కులకు పాతరేస్తోంది. యోగి దుందుడుకు వైఖరిని బట్టి స్పష్టమవుతోంది. సిట్ నివేదికలో కుట్ర జరిగిందని ఒప్పుకున్నప్పటికీ.. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అజరు మిశ్రా టేనిని కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం రైతుల పొట్టకొట్టుతోంది. మరోవైపు, ఈ ఘటనలో పేరున్న రైతులను ఇరికించి అరెస్టు చేయడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు చురుగ్గా ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీలో సంయుక్త కిసాన్ మోర్చా శాశ్వత మోర్చాను ప్రకటించనుంది. అలాగే ''మిషన్ ఉత్తరప్రదేశ్'' కొనసాగుతుంది. దీని ద్వారా ఈ రైతు వ్యతిరేక రాజకీయాలకు గుణపాఠం చెబుతాం'' అని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు.
''ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశంలోని కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు కార్మిక కోడ్లను ఉపసంహరించు కోవాలనీ, అలాగే రైతులకు ఎంఎస్పీ ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎస్కేఎం గ్రామీణ సమ్మె రూపంలో ఈ పిలుపును సమర్థిస్తుంది. మద్దతు ఇస్తుంది'' అని తెలిపారు. పంజాబ్ ఎన్నికల్లో పార్టీలను పెట్టి అభ్యర్థు లను నిలబెట్టడానికి కొన్ని రైతు సంఘాలు ప్రకటనలు చేశాయి. దాని గురించి ఎస్కేఎం మొదటి నుంచి తన వైఖ రిని స్పష్టం చేస్తూ వచ్చింది. ఏ రాజకీయ పార్టీ తన పేరు, బ్యానర్ లేదా ప్లాట్ ఫారమ్‌ను ఉపయోగించకూడదని ఎస్కే ఎం స్పష్టం చేసింది. ఎన్నికలకు కూడా ఇదే నిబంధన వర్తి స్తుంది. ఎస్కేఎం పేరు, బ్యానర్, ప్లాట్‌ఫారమ్‌ను ఎన్నికల్లో ఏపార్టీ, అభ్యర్థి ఉపయోగించకూడదు. ఎస్కేఎంతో సంబం ధం ఉన్న ఏ రైతు సంఘం, నాయకుడు, ఎన్నికల్లో పోటీ చేసి నా, ఎన్నికల్లో ఏ పార్టీకి కీలక పాత్ర పోషించినా సంయుక్త కిసాన్ మోర్చాలో ఉండరు. అవసరమైతే, ఈ అసెంబ్లీ ఎన్నికలతరువాత ఏప్రిల్నెలలో ఈనిర్ణయం సమీక్షించబడు తుంది'' అని స్పష్టం చేశారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితుల కుటుంబాలను పరామర్శిస్తామని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఈ నెల 21 నుంచి దాదాపు 4 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.