Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో 12 నుంచి 14 ఏండ్లలోపు చిన్నారులకు మార్చి నుంచి వ్యాక్సిన్లు వేయనున్నట్టు కేంద్రం తెలిపింది. వారికి మార్చి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావచ్చని నేషనల్ టెక్నికల్ ఆడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ)కి చెందిన కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మెన్ డాక్టర్ ఎన్‌కె అరోడా సోమవారం తెలిపారు. గతేడాది జనవరి 17 నుంచి దేశంలో కేంద్రం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొందరు రెండు డోసులను తీసుకోగా.. మరికొందరు బూస్టర్ డోస్‌ను తీసుకోనున్నారు. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏండ్లలోపు వారికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టింది. మార్చి నాటికి 15-18 ఏండ్లలోపు వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఈ వయస్సు బాలబాలికలు మొదటి డోస్ వేయించుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్లో తెలిపారు.