Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో అంగన్వాడీ వర్కర్ల ప్రదర్శన
- నీలోఖరి ఎమ్మెల్యే ధరంపాల్ గొండార్ నివాసం వద్ద ధర్మా
కర్నాల్ : హర్యానాలోని కర్నాల్‌లో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ..అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నీలోఖరి ఎమ్మెల్యే ధరంపాల్ గోండార్ నివాసం వద్ద ధర్నా చేశారు. ఆయనకు వినతి పత్రం ఇచ్చి డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తమ డిమాండ్లపై ఇప్పటివరకూ ఐదుసార్లు ప్రభుత్వంతో చర్చలు జరగ్గా..కొన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని సంఘం నేతలు తెలిపారు. అన్ని డిమాండ్లను నెరవేర్చే దాకా ఆందోళనలు కొనసాగుతాయని అంగన్వాడీ యూనియన్ స్పష్టం చేసింది.డిసెంబర్ 8 నుంచి రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు-హెల్పర్లు సమ్మె చేస్తున్న విషయం విదితమే.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సత్పాల్ సైనీ, హుడా యూనియన్ రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేవా రామ్, ఉపాధ్యక్షుడు ఒపి మాతా, బిజ్నేష్ రాణా మాట్లా డుతూ హర్యానాలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు న్యాయమైన డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. హర్యానా ప్రభుత్వం , మహిళా , శిశు అభివృద్ధి శాఖతో యూనియన్ పలుమార్లు భేటీ అయినా ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదన్నారు.వర్కర్ నుంచి సూపర్వైజర్గా పదోన్నతి ఎలాంటి షరతులు లేకుండా వర్తిస్తుంది. కేంద్రాల అద్దె గ్రామీణ ప్రాంతాల్లో రూ.2000, పట్టణాల్లో రూ.3000, నగరాల్లో రూ.5000 పెరిగింది. వర్కర్, హెల్పర్ యూనిఫాం మొత్తాన్ని రూ.2000కు పెంచాలి. ఇంధనం మొత్తాన్ని పెంచాలి లేదా గ్యాస్ సిలిండర్‌ను డిపార్ట్మెంట్ చేత నింపి ఇవ్వాలి. వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల హౌదా రావాలి. హౌదా ఇవ్వనంత వరకు కనీస వేతనం కార్మికుడికి 24 వేలు, హెల్పర్‌కు 16 వేలు ఇస్తామన్నారని యూనియన్ నేతలు తెలిపారు. 2018లో చేసిన ప్రకటనలను వర్తింపజేసి, కరువుభత్యం అలవెన్స్లోని అన్ని వాయిదాలను గౌరవ వేతనానికి జోడించి బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.