Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్, సేల్స్ రిప్రెజెంటేటివ్స్ అసోసియేషన్ వెల్లడి
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అమల్లోకి తెచ్చిన లేబర్కోడ్లు ఔషధ కంపెనీల్లో పనిచేసే సేల్స్ ప్రమోషన్స్, రిప్రెంజెంటేటీవ్స్ ఉద్యోగుల జీవితాల్ని తలకిందులు చేసే పరిస్థితి వచ్చింది. ఉద్యోగ భద్రత, ఇతర ప్రయోజనాల్ని దూరం చేస్తూ వారిని రోడ్డున పడేస్తున్నాయి. దాంతో లేబర్కోడ్లకు వ్యతిరేకంగా మెడికల్, సేల్స్ రిప్రెజెంటేటివ్స్ దేశవ్యాప్త ఆందోళనకు దిగారు. ఈనెల 19న సమ్మెకు పిలుపునిచ్చారు. సేల్స్ ప్రమోషన్, రిప్రెంజేటివ్స్గా ప్రయివేట్ మెడికల్ రంగంలో పనిచేస్తున్న లక్షా 10వేల మంది ఉద్యోగులు నిరసనగళం వినిపించబోతున్నారు. కనీస వేతన చట్టాన్ని అమలుజేయాలని 'ద ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రెజెంటేటివ్స్ అసోసియేషన్(ఎఫ్ఎంఆర్ఏఐ) డిమాండ్ చేస్తోంది. వర్క్ ఫ్రం హోం..విధానం ఔషధరంగంలో పనిచేసే సేల్స్, రిప్రెజెంటేటివ్స్కు సాధ్యం కాదని, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నాయకుడు పార్థా రఖీత్ అన్నారు. కరోనా సంక్షోభాన్ని, లాక్డౌన్ను అడ్డుపెట్టుకొని ఎంతోమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, విధుల్లో ఉన్నవారికీ పూర్తి వేతనాలు ఇవ్వటం లేదని ఆయన చెప్పారు.లేబర్ కోడ్ నిబంధనల కారణంగా ఉద్యోగుల్ని ఇష్టమున్నట్టుగా కంపెనీలు నియమిస్తాయని, ఏకపక్షంగా తొలగిస్తాయని ఎఫ్ఎంఆర్ఏఐ ఆరోపిస్తోంది. ''సేల్స్ ప్రమోషన్ యాక్ట్ 1976ను కేంద్రం రద్దు చేసి కొత్తగా లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. గొడుగుమాదిరి ఉద్యోగ భద్రత, రక్షణ, ఇతర ప్రయోజనాలు కల్పించిన 1976 చట్టాన్ని రద్దు చేయటాన్ని ఉద్యోగులంతా నిరసిస్తున్నారు. జీవనాధారమైన ఔషధాలు, మందులపై మోడీ సర్కార్ 12శాతం జీఎస్టీ విధించటాన్ని వ్యతిరేకిస్తున్నా''మని సేల్స్ ప్రమోషన్, రిప్రెంజేటివ్స్ ఉద్యోగ సంఘాల జనరల్ సెక్రటరీ శంతను ఛటర్జీ మీడియాకు తెలిపారు.