Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవాస్‌ను ప్రభుత్వం వదలదు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఆంట్రిక్స్ కార్పొరేషన్, దేవాస్ మల్టీ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ మధ్య 2005లో జరిగిన ఒప్పందం మోసపూరితమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో ఆర్బిట్రేటర్‌ను నియమించలేదన్నారు. దేవాస్ కంపెనీని వైండింగ్ అప్ చేయాలని (మూసేయాలని) నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించిందని, సమగ్రమైన ఆదేశాలను జారీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తప్పుడు పనులకు ఏ విధంగా పాల్పడిందో సుప్రీం కోర్టు ఆర్డర్ స్పష్టం చేస్తోందన్నారు. ఆంట్రిక్స్-దేవాస్ ఒప్పందం దేశ భద్రతకు వ్యతిరేకమని చెప్పారు. భారత దేశ ప్రజలకు ఏ విధంగా మోసం జరిగిందో కాంగ్రెస్ చెప్పాలన్నారు. దేశ భద్రతా ప్రయోజనాలకు ఉపయోగించే ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఆంట్రిక్స్-దేవాస్ ఒప్పందం కోసం కేటాయించడానికి యూపీఏ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగపరిచిందని ఆరోపించారు.