Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురి నేవీ సిబ్బంది మృతి!
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి నావల్ డాక్ యార్డ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ రణ్వీర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, ఈ ఘటనలో 11మంది గాయపడగా.. వారందరినీ చికిత్స నిమిత్తం ముంబయి నౌకాదళ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. నౌకాదళ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు భారత నౌకాదళం వెల్లడించింది.