Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మధ్యప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా జస్వీంధర్ సింగ్
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) మధ్యప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా జస్వీంధర్ సింగ్ ఎన్నిక అయ్యారు. 30 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. సీపీఐ(ఎం) మధ్యప్రదేశ్ రాష్ట్ర 16వ మహాసభలు మూడు రోజుల పాటు జరిగి, మంగళవారం ముగిశాయి. ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ ప్రపంచం, దేశంలో అనేక ఉదాహరణలు చెబుతూ క్లిష్ట పరిస్థితుల్లోనూ, నియంతల పాలనలోనూ ప్రజల పోరాటం సాగిందని తెలిపారు. ఈ పోరాటాల్లో అంతిమంగా ప్రజలే గెలిచారని అన్నారు. నియంతలు, వారి అనాగరికత ఓడిపోయిందని గుర్తు చేశారు. శ్రామిక ప్రజలు తమ కష్టాల నుంచి బయటపడటానికి త్యాగాలు చేయడం తెలుసు అనీ, దాని ఆధారంగా వారు విజయాల గమ్యాన్ని చేరుకోగలరని తెలిపారు. వామపక్షాలు బలహీనంగా ఉన్నాయన్న అపోహను తొలగిస్తూ, బలానికి పార్లమెంటరీ అధికారమే కొలమానం కాదన్నారు. ఇటీవలి చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమం, కార్మికుల పోరాటాల్లో వామపక్షాల పాత్ర దీనిని ఉదహరించడానికి సరిపోతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దీనిని మరింత ఉధృతం చేయాల్సి ఉందని, మధ్యప్రదేశ్‌లో కూడా సీపీఐ(ఎం) ప్రజల స్థానిక సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ మాట్లాడుతూ బీజేపీ పాలనలో సామాజిక అన్యాయం చాలా భయంకరమైన, వేగవంతమైన పెరుగుదల వాస్తవికతను వివరించారు. ఇది మనువాద పునరుద్ధరణ కుట్రలో భాగమేనన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయనీ, ఎందుకంటే దానిని ఆర్ఎస్ఎస్-బీజేపీ తమ ప్రయోగశాలగా ఉంచుకున్నాయని తెలిపారు. సీపీఐ(ఎం), వామపక్షాలు కూడా ఈ సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని, ఎందుకంటే ఇది కూడా వర్గ దోపిడీలో భాగమేనని స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో వామపక్షాలు పోటీ
ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలు పది స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు చెరో నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో పోటీ చేయనున్నది. కేథర్ నాథ్, థరాలీ, షాహాస్పూర్, రానిపూర్ అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ చేయగా, రుద్రప్రయాగ్, గంగోత్రి, నరేంద్ర నగర్, బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనున్నది. కర్ణప్రయాగ్, లాల్కూమ్ అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ(ఎంఎల్) బరిలో దిగనున్నది.