Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిఘావర్గాల తీవ్ర హెచ్చరికలు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులపై దాడికి ముష్కరులు కుట్ర పన్నినట్టు సమాచారం. ఈ మేరకు 9 పేజీల ఇంటెలిజెన్స్ నివేదిక కేంద్ర హౌంశాఖకు చేరినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్, ఆఫ్గన్-పాక్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతోపాటు బహిరంగసభలు, కీలకమైన సంస్థలు, రద్దీ ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సమూహాలు కుట్ర చేసినట్టు ఐబీ వెల్లడించింది. డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడవచ్చని హెచ్చరించినట్టు తెలిసింది. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రర్ సంస్థలు ఈ ఉగ్ర ప్రణాళిక వెనుక ఉన్నట్టు పేర్కొంది. పాకిస్తాన్లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయని.. పంజాబ్పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి.