Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మజ్దూర్ కిసాన్ ఏక్తా దివస్ విజయవంతంగా జరిగింది. అన్ని రాష్ట్రాల్లో వివిధ రూపల్లో ఆందోళనలు జరిగాయి. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంఘాలు సంయుక్తంగా ఆందోళనలు చేశాయి. బుధవారం మజ్దూర్ కిసాన్ ఏక్తా దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని బీటీఆర్ భవన్ వద్ద ఆందోళన జరిగింది. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ 1982 సార్వత్రిక సమ్మెలో మొదటిసారి చూసిన రైతు, కార్మికుల ఐక్యత చారిత్రాత్మక ఔచిత్యం గురించి వివరించారు. కార్పొరేట్-ఫాసిస్ట్ అనుబంధానికి వ్యతిరేకంగా రైతుల ఉద్యమం పోషించిన స్ఫూర్తిదాయకమైన పాత్రను నొక్కి చెప్పారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు తదితరులు పాల్గొన్నారు. ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి.