Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఆస్ట్రేలియాకు చెందిన బ్లాక్మోర్స్ తమ మల్టీ విటమిన్ శ్రేణీ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించేందుకు ఉడాన్తో పంపిణీ భాగస్వామ్యం చేసుకుంది. దీంతో తమ ఉత్పత్తులు ఫార్మసీల్లో అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ పేర్కొంది. ఇప్పటికే తమ సంస్థ ఆసియా, పసిఫిక్ సహా 12 ఇతర మార్కెట్లలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోన్నట్లు బ్లాక్మోర్స్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలస్టెయిర్ సిమింగ్టన్ తెలిపారు. సహజసిద్ధమైన ఆరోగ్యం పట్ల అభిరుచి కలిగి భారతీయుల ప్రయాణంలో భాగం కానుండటం పట్ల సంతోషంగా ఉందన్నారు.