Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మౌస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ న్యూ వెర్షన్‌ని గురువారం పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్టు డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణిని భారత్ నిరంతరం పరీక్షిస్తోంది. అంతకుముందు జనవరి 11న ఆధునీకరించిన సూపర్సోనిక్ బ్రహ్మౌస్ క్షిపణి ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
తాజాగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అధునాతన వైవిధ్యాన్ని గురువారం ఇండియన్ నేవీస్ (ఐఎన్ఎస్) పరీక్షించిందనీ.. క్షిపణి లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని, నూతన సాంకేతికతలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని డీఆర్డీవో అధికారి తెలిపారు. ఈ సూపర్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను భారత్‌కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవోఎం కలిసి అభివృద్ధి చేశాయి. ఈ పరీక్షపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డీఆర్డీవోను అభినందించారు. ఈ క్షిపణులను భూమి మీద నుంచి, ఆకాశంపై నుంచి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను యాంటీషిప్, లాండ్ ఎటాక్ ఇలా రెండు పాత్రలు పోషించేలా రెండు రకాలుగా డిజైన్ చేశారు. ఈ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ఇప్పటికే ఇండియన్ నేవీలో, ఇండియన్ ఆర్మీలో సమర్థవంతంగా వినియోగిస్తున్నారని డీఆర్డీవో తెలిపింది.