Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేకు ఘోర ప్రభావం జరిగింది. స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను తరిమికొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఖతౌలి నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రం సింగ్ షైనీ ముజఫర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. విక్రం సింగ్‌ను కనీసం కారు కూడా దిగకుండా స్థానికులు చట్టుముట్టారు. వ్యతిరేక నినాదాలు చేస్తూ అతన్ని తరిమికొట్టారు. ఈ ఘటనకు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలతో పాటు, షైనీపై వున్న వ్యతిరేకత కూడా కారణంగా భావిస్తున్నారు. షైనీ గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. జమ్ముకాశ్మీర్‌కు ఆర్టికల్ 370ను రద్దు చేసిన సమయంలో 'కాశ్మీర్లో అందమైన అమ్మాయిలను' బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు వివాహం చేసుకోవచ్చు అని షైనీ వాఖ్యలు చేశారు. అలాగే, దేశానికి వ్యతిరేకంగా విమర్శలు చేసేవారిపై బాంబులు వేస్తానని 2019 జనవరిలో షైనీ బెదిరించారు. ఆవులను అవమానించే వారి చేతులు, కాళ్లు విరగొడతానిని కూడా షైనీ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారు.