Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 34 మంది పేర్లు ప్రకటన
- మనోహర్ పారిక్కర్ కుమారుడికి దక్కని ఛాన్స్
పనాజీ : అతి తక్కువ అసెంబ్లీ స్థానాలున్న గోవాలో రాజకీయాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 34 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. అయితే, ఇందులో కేంద్ర రక్షణశాఖ మాజీ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కుమారుడు ఉత్పల్ పారిక్కర్ పేరు మాత్రం లేదు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. మనోహర్ పారిక్కర్ పోటీ చేసిన నియోజకవర్గమైన పాంజిమ్ సీటును ఉత్పల్ ఆశించారు. అయితే, బీజేపీ ఆ సీటును మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో 'బాబుశ్' మోన్సెరేట్కు కేటాయించింది. మోన్సెరేట్కు టికెట్ కేటాయింపుపై ఇంతకముందే బీజేపీ సూచనలిచ్చింది. దీంతో టిక్కెట్ల పంపిణీ ప్రక్రియపై బీజేపీని ఉత్పల్ పారిక్కర్ ప్రశ్నించారు.