Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రయాగ్రాజ్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతునివ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత స్పష్టం చేశారు. ఫలానా పార్టీకి మద్దతునిస్తుందన్న వార్తలను ఖండించారు. పరేడ్ గ్రౌండ్లో రైతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 'చింతన్ శివిర్'లో పాల్గొనేందుకు మాగ్ మేళాకు మంగళవారం వచ్చిన తికాయత్ మాట్లాడుతూ.. ' ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వం' అని తేల్చి చెప్పారు. రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతునివ్వాలంటూ బీకేయూ ప్రెసిడెంట్ నరేష్ తికాయత్ కోరిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అయితే.. సిసౌలిలో బీజేపీకి చెందిన సంజీవ్ బల్యాన్తో సమావేశమైన కొన్ని గంటల తర్వాత నరేష్ తికాయత్ తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. రైతుల చింతన్ శివిర్పై రాకేశ్ మాట్లాడుతూ... రైతుల సమస్యలపై చర్చించామని అన్నారు.