Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛండీగఢ్. హర్యానా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమ్మె కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబరు 8న ప్రారంభమైన సమ్మె 40 రోజుల దాటినా ఉధృతంగా కొనసాగుతోంది. మూడు యూనియన్ల కలయికతో ఏర్పాటైన సంయుక్త కోర్డినేషన్ కమిటీ అధ్యక్షతన సమ్మె జరుగుతోంది. వర్షాలు, తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అంతకు ముందు నుంచి కూడా కార్మికులు తమ సమస్యలపై ధర్నాలు, ఆందోళనలు చేసేవారు. సీఐటీయూ వీరందర్నీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చింది. వేతనాలు పెంచాలని, 2018లో ప్రధాని మోడీ ప్రకటించిన బకాయిలు విడుదల చేయాలని, పదవీ విమరణ సౌకర్యాలు కల్పించాలి.. వంటి ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు.