Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింహాసనమెక్కెదేవరో తేల్చటానికి రెడీ
- నిరుత్సాహపర్చిన పాలకులకు భంగపాటు
యువతరం చేతుల్లో దేశభవిష్యత్తు ఉన్నదన్న విషయం పాలకులకు విదితమే. కానీ కార్పొరేట్ల మోజులో పడి ఉపాధి లేకుండా చేయటానికి మోడీ, బీజేపీ పాలితరాష్ట్రాలు దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే యువత కు ఊరడించే ఉపాధి కల్పిస్తామంటూ హామీలు గుమ్మరిస్తున్నాయి. అయితే యువత తలుచుకుంటే..అధికారాల్లో ఉన్న వారిని గద్దెదించగలరని ఉత్తరప్రదేశ్ యువతరం నిరూపించనున్నది. గతంలో మూడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుత్సాహపర్చిన ప్రభుత్వాలను గద్దెదించారు. ఇంతకీ ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏమున్నది..?
లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ షురూ అయింది. అధికార బీజేపీ,ప్రతిపక్ష పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధమైన ఓటుతో దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వటానికి యువతరం సన్నద్ధమైంది.
యూపీలో యువ ఓటర్లే కీలకం..
యూపీలో యువ ఓటర్లు కీలకంగా మారబోతున్నారు. 18 నుంచి 30 ఏండ్ల వయస్సు ఉన్న వారి ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి రాష్ట్ర ఓటర్లలో 26 శాతం యువత గద్దెనెక్కేవారిని డిసైడ్ చేయగలరని గతంలో మూడు సార్లు నిరూపించారు. అందుకే యూపీలోని నాలుగు పార్టీల జోరు కొనసాగుతోంది. 2007, 2012 , 2017లో జరిగిన ఎన్నికల్లో అధికారపార్టీలను గద్దె దింపారు. ఇపుడు యోగి పరిస్థితేంటనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ మూడుసార్లు ఎన్నికల్లో అధికారపార్టీలకు ఏవిధంగా పరాభవం ఎదురైంది..? యువశక్తి ఏలా తమ ఓటును వినియోగించుకుని అధికారపార్టీలకు షాక్ ఇచ్చారు.? ఇలాంటి ఆసక్తికర అంశాలు
2007 ...
ఐదేండ్లలో కేవలం 91 వేల ఉద్యోగాలే ..!
'ఏనుగు సింబల్‌తో బీఎస్పీ చీఫ్ మాయవతి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఉపాధి లేక పస్తులుంటున్న మీకు..నేను అండగా నిలుస్తా. రాష్ట్ర యువత కులాల ఊబిలోంచి బయటపడాలంటూ పిలుపిచ్చారు. యువతరం ఆమెకు అండగా నిలిచారు.2007 అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లలో 206 సీట్లను గెలుచుకున్నారు. ఆమె పాలనలో కేవలం 91వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వరకు ఉన్న యువతకు ఏలాంటి ఉపాధి పథకాలను ప్రారంభించలేదు. అంతే 2012లో 80 సీట్లకు యువత కుదించేసింది.ఇపుడు 19 సీట్లకే బీఎస్పీ పరిమితమైంది.యువత అండగా ఉన్నపుడు 206 సీట్లు వస్తే...వారిని నిర్లక్ష్యం చేసిన ఫలితమే సీట్లు బాగా తగ్గిపోయాయి.
2012..
అధికారం దక్కాలంటే..యువతను మచ్చిక చేసుకోవాలే..సమాజ్‌వాది పార్టీ
యూపీలో ఆనాడు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ములాయంకు రాజకీయ గణితంపై స్పష్టమైన అవగాహన ఉన్నది. యూపీలో 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్న ఓటరు ్ల 3.8 కోట్ల మంది ఉన్నట్టు గుర్తించారు. ఆ మేరకు ఎస్పీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించింది. 10వ తరగతి పిల్లలకు పీసీ ట్యాబ్లెట్, 12వ తరగతి పాసైన వారికి ల్యాప్‌టాప్‌లు. బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య. నిరుద్యోగ భృతి కింద ప్రతి ఏటా రూ.12 వేలు ఇస్తామంటూ ప్రకటించింది. 2012 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వచ్చేసరికి సమాజ్‌వాది పార్టీ 224 సీట్లు గెలుచుకున్నది. అఖిలేశ్‌కు అధికార పీఠం అప్పగించారు. రాష్ట్రానికి యువ సీఎం కావాలి అని అన్నారు. అయితే ఎస్పీ పదవీ కాలంలో 10వ తరగతి పిల్లలకు ఎన్ని పీసీ ట్యాబ్‌లను పంపిణీ చేశారనే కచ్చితమైన డేటాను ఇవ్వలేకపోయిది. 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామనీ, ఆ తర్వాత టాపర్లకే ఇస్తామని ప్రకటించింది. (2012 నుంచి 2017 మధ్య) ఐదేండ్లలో కేవలం 2 లక్షల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్టు అధికార గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. 2017 ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి ఎస్పీ కేవలం 47 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
2017...
యూత్ జితేగా బూత్..ఏక్ బూత్ పాంచ్ యూత్ నినాదం. బీజేపీ
అధికారం కావాలంటే యువతను మచ్చిక చేసుకోవాలని బీజేపీ స్కెచ్ వేసింది. యూత్ జితేగా బూత్, ఏక్ బూత్ పాంచ్ యూత్ అనే రెండు నినాదాలిచ్చింది. దీనికి తోడు దేశంలోని రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ ఇచ్చిన అబద్ధపు హామీతో బీజేపీ యూపీలో గెలిచింది. మొత్తం 403 స్థానాలకు గాను 312 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది.ఫలితాల తర్వాత బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం చేసింది. యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలిస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ ఆ దిశగా నిరుద్యోగులకు మొండిచేయి చూపింది. ఇటీవల (2022 జనవరి 4) ప్రయాగరాజ్ నగరంలో చలి, చీకటిని చీల్చుకుంటూ..వందలాది మంది నిరుద్యోగ యువత తమ డిమాండ్లతో రోడ్డెక్కారు. ప్రయాగ్‌రాజ్‌లోనే కాదు, లక్నో వంటి ఇతర నగరాల్లో కూడా యువత నాలుగైదు నెలలుగా ఉద్యోగాల కోసం నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు పరీక్షల పేపర్లు లీకైనప్పుడు యోగి ప్రభుత్వాన్ని యువత నిలదీస్తోంది.దీంతో ఈ సారి తమను యువత ఎక్కడ కూర్చొబెడుతుందోనన్న భయం బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది.