Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ వ్యాప్తంగా రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) గురువారం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. ఫ్యాప్టో తలపెట్టిన ముట్టడి కార్యక్రమానికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి. అయితే కలెక్టరేట్ల ముట్టడికి ముందే ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులిస్తూ చాలా చోట్ల గృహనిర్బంధాలు చేశారు. నోటీసులు పట్టించుకోకుండా వెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు అన్ని కలెక్టరేట్ల వద్ద భారీగా పోలీసుల మోహరించారు.అయినా వెనక్కి తగ్గలేదు. రాష్ట్రంలో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తోపులాటలు..స్వల్పలాఠీచార్జిలతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.