Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి..
లక్నో: దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానా లున్న రాష్ట్రంయూపీలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిక రంగా మారుతు న్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తొలిసారిగా అసెంబ్లీఎన్నికల బరిలో నిలుచుంటు న్న విషయం విది తమే. అయితే, ఆయనపై భీమ్ ఆర్మీచీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేయనున్నారు. తొలి సారిగా తన సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్ సదర్ నుంచి పోటీ చేస్తున్నయోగిపై చంద్రశేఖర్ ఆజాద్ బరిలో నిలుచోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ మేరకు ఆజాద్ సమాజ్ పార్టీ చంద్రశేఖర్ పేరును గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని చంద్రశేఖర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. చంద్రశేఖర్‌కు కూడా ఇదే తొలి ఎన్నిక కావడం గమనార్హం. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను యోగికి వ్యతిరేకంగా పోటీ చేస్తానని చంద్రశేఖర్ గతంలోనే ప్రకటించారు. గోరఖ్‌పూర్ సదర్ నియోజవర్గంలో యోగికి ప్రధాన పోటీ ఎస్పీ నుంచి ఉన్నది. అయితే, యోగిపై పోటీ చేయడానికి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆప్ వంటి ప్రధాన పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో యోగిపై అభ్యర్థిని ప్రకటించిన తొలి పార్టీగా ఆజాద్ సమాజ్ పార్టీ నిలిచింది. ప్రస్తుతం గోరఖ్‌పూర్ సదర్ అసెంబ్లీ స్థానం బీజేపీ చేతిలో ఉన్నది. 2017లో ఇక్కడ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన రాధా మోహన్ దాస్ 60వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. యోగిని తొలుత అయోధ్య లేదా మధుర లలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలపాలని బీజేపీ అధిష్టానం భావించింది. అయితే, సమీకరణాలు కుదరకపోవటంతో గోరఖ్‌పూర్ సదర్ నుంచి అసెంబ్లీ బరిలో ఆయనను నిలబెడుతున్నది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోడీపై పోటీ చేస్తానని ప్రకటించడంతో చంద్రశేఖర్ ఆజాద్ వార్తల్లో నిలిచారు. అయితే, చివరకు ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.