Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16.41శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
- ఎనిమిది నెలల గరిష్టానికి కేసులు
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి వైరస్ విరుచుకుపడుతున్నది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మూడు లక్షల మార్కును దాటేశాయి. అమెరికా తర్వాత అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నులుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 19,35,180 మందికి పరీక్షలు ఉర్వహించగా.. 3.17 లక్షల తాజా కేసులు వెలుగుచూశాయి. ఎనిమిది నెలల గరిష్టానికి కేసులు నమోదయ్యాయి. కిందట రోజు కన్నా 12 శాతం ఎక్కువ. గడిచిన 24 గంటల్లో 491 మంది కరోనాకు బలయ్యారు. పాజిటివిటీ రేటు 15.13 శాతం నుంచి 16.41 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 19.24లక్షలను దాటాయి. గడిచిన 24 గంటల్లో 2,23,990 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరవయ్యాయి. ఇప్పటివరకూ 3.82 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,87,693 మందిని మహమ్మారి బలి తీసుకున్నది. మొత్తం రికవరీలు 3.58 కోట్లు (93.69 శాతం)కు చేరుకున్నాయి. క్రియాశీల రేటు 5.03 శాతానికి పెరిగిపోయింది. ఇప్పటివరకూ 159 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 61,75,049 బూస్టర్ డోసులు వినియోగమయ్యాయి.