Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్లో జెడి-యు 'బెదిరింపు రాజకీయాలు' హాస్యాస్పదంగా మారాయి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చర్చలు విఫలమైతే కూటమి నుంచి బయటకు వెళ్తామనే జెడి-యు బెదిరింపులను బిజెపి పట్టించుకోవడం లేదు. యుపిలో జెడియుతో జట్టు కట్టుడానికి బిజెపి ఆసక్తి చూపింకపోయినా జెడియు ఇంకా బిజెపిపై ఆశలు వదులుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. యుపిలో ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఇప్పటికే తొలి జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఏ సందర్భంలోనూ జెడి-యు తన మిత్ర పక్షంగా పేర్కొలేదు.