Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన పార్లమెంట్ నిర్మాణ వ్యయం
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఖర్చు అనుకున్న దాని కన్నా ఎక్కువ అవుతుందని సమాచారం. సుమారు 282 కోట్ల రూపాయల మేర అదనపు వ్యయం కానుందని తెలుస్తోంది. రూ. 977 కోట్ల బడ్జెట్ వ్యయానికి కన్నా... 29 శాతం అదనం. మొత్తంగా ఈ నిర్మాణం ఖర్చు రూ. 1250 కోట్లు దాటనుంది. ఈ నిర్మాణానికి డిసెంబర్ 2020 శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు 40 శాతం పనులను టాటా ప్రాజెక్టు పూర్తి చేసింది. 13 ఎకరాల్లో ప్రతిపాదిత నాలుగు అంతస్తుల భవనంలో నిర్మితమౌతన్న పార్లమెంట్ భవనం.. రాష్ట్రపతి భవన్కు కూత వేటు దూరంలోనే ఉంది. ఈ భవనాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధం చేయాలని తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని తుది గడువుగా ప్రభుత్వం విధించింది.