Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎక్స్రే సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఎఐ) ఉపయోగించి నిమిషాల్లోనే కొవిడ్-19ను గుర్తించే నూతన పరీక్షను స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ స్కాట్లాండ్ (యుడబ్ల్యూఎస్)లోని ఒక శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసిన ఈ పరీక్ష 98 శాతం ఖచితత్వంతో ఫలితాలను ఇస్తుంది. 'అత్యాధునిక ఎక్స్-రే సాంకేతికతను ఉపయోగించుకుంటూ, కోవిడ్ రోగులు, ఆరోగ్యవంతమైన వ్యక్తులు, వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్న వ్యక్తులకు చెందిన దాదాపు 3 వేల చిత్రాల డేటాబేస్ను కృత్రిమ మేధస్సు స్కాన్ చేసి ఫలితం వెల్లడిస్తుంది' అని మెడికల్ న్యూస్ తెలిపింది. ఈ సాంకేతికతతో ప్రమాద, అత్యవసర విభాగాలపై ప్రధానంగా ఆర్టి-పిసిఆర్ పరీక్షలు అందుబాటులో లేని దేశాల్లో భారాన్ని తగ్గించవచ్చునని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ నయీమ్ రంజాన్ చెప్పారు. పరిమిత రోగ నిర్ధారణ సాధానాల కారణంగా అనేక దేశాలు పెద్ద ఎత్తున్న పరీక్షలు నిర్వహించలేకపోతున్నాయని ఆయన చెప్పారు. అయితే ప్రారంభ దశలో ఉన్న కోవిడ్ లక్షణాలు ఎక్స్రేల్లో కనిపించవు.