Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతోన్న క్రియాశీల రేటు
- దేశంలో కొనసాగుతున్న కరోనా విలయం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. కేసులతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 3.50 లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 3,47,254 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కన్నా 9శాతం అదనం. తాజాగా మరో 703 మందిని మహమ్మారిని బలితీసుకుంది. దీంతో ఇప్పటి వరకు 3.85 కోట్లకు కేసులు చేరుకున్నాయి.మొత్తం 4,88,396మందిని కరోనా బలితీసుకు ంది. యాక్టివ్ కేసులు 20.18 లక్షలకు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,51,777మంది కోలుకున్నారు. రికవరీ రేటు 93.50 శాతానికి పడిపోయింది. ఒమిక్రాన్ కేసులు 9,692 చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 70 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సిన్ల వినియోగంలో మొత్తంగా 160 కోట్ల మైలురాయికి భారత్ చేరింది.
ఐదేండ్లలోపు చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదు.. : కేంద్రం
దేశవ్యాప్తంగా కోవిడ్ విజంభిస్తోన్న వేళ... కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఐదేండ్లలోపు చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని స్పష్టంచేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేండ్ల నుంచి 11 ఏండ్ల వయస్సు పిల్లలు మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది.ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి 12 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పెద్దలలాగానే మాస్క్‌ను తప్పనిసరిగా ధరించా లని కేంద్రం తెలిపింది.