Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 23న ఆవిష్కరించనున్న ప్రధాని
న్యూఢిల్లీ : ఇండియా గేట్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుందంటూ ప్రధాని మోడీ ప్రకటన చేశారు. ఆ విగ్రహం పనులు పూర్తి అయ్యేటంతవరకు ఆయన హౌలోగ్రామ్ స్టాట్యూను నేతాజీ జయంతి అయినటువంటి జనవరి 23నాడు ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. ''దేశం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరుపుకుంటున్న కాలంలో ఆయనకు చెందిన గ్రానైట్ తో రూపొందించేటటువంటి విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద స్థాపించడం జరుగుతుందని తెలియ జేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది ఆ మహానుభావుడికి భారతదేశం రుణ పడి ఉండనే భావనకు సంకేతంగా ఉండబోతోంది.