Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదో టైం వేస్ట్ వ్యవహారం..
- దేశ ప్రజలు తమ బాధ్యతను మరిచారు : మోడీ
- ప్రధాని తన బాధ్యతలు నెరవేరుస్తున్నారా? : రాజకీయ విశ్లేషకులు
- రాజ్యాంగబద్ధంగా పాలించటంలో ఆయనే విఫలమయ్యారు..
దేశంలో రైతులు, కార్మికులు, పేదలు, అణగారిన వర్గాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. దేశ సంపదను ప్రయివేటుపరం చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. అయితే ఇదంతా టైం వేస్ట్ వ్యవహారమని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలు తమ బాధ్యతను మరిచారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 'ఆజాదీగా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ ప్రధానిగా..అత్యున్నత పదవిలో ఉన్న ఆయనే తన బాధ్యతలు నెరవేర్చటంలో విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. న్యాయం, సమానత్వం, హక్కుల కోసం ప్రజలు పోరాడటం ప్రధాని మోడీకి టైం వేస్ట్ వ్యవహారంగా కనపడిందా? అని వారు ప్రశ్నించారు.
న్యూఢిల్లీ : దేశంలో అందరూ హక్కుల గురించి మాట్లాడేవారే! ఏదో ఒకానొక ప్రత్యేక సందర్భంలో అయితే ఫరవాలేదు. కానీ ఎప్పుడూ అదే గోల. ప్రజ లందరూ బాధ్యతలు మరిచి..హక్కులపై ఆందోళనల కు దిగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. తమ బాధ్యతను మరిచిపోయారు. తద్వారా భారత్‌ను బలహీన దేశంగా మారుస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.
ప్రధానిగా ఆయన బాధ్యతల సంగతేంటి?
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీ యాంశమయ్యాయి. భారత రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతల్ని ప్రధాని మోడీ నెరవేరుస్తున్నారా? అనే చర్చకు తెరలేచింది. లౌకికత్వానికి, సామాజిక న్యాయానికి, వాక్ స్వాతంత్య్రానికి, మీడియా స్వేచ్ఛకు తూట్లు పోడిచిన ప్రభుత్వంగా మోడీ సర్కార్‌ను గుర్తుపెట్టుకుంటారని, అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని మోడీ తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించటం లేదనే విషయాన్ని గ్రహించటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
మత విద్వేషాన్ని పెంచుతున్నారు
ముస్లింలపై విద్వేషాన్ని వెళ్లగక్కే శక్తులకు ప్రధాని మోడీ ప్రభుత్వం బలం చేకూరుస్తోంది. భారత రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన లౌకిక భావనలను దెబ్బతినకుండా చూడటం ప్రధానిగా ఆయన ముఖ్య బాధ్యత. దీనికి విరుద్ధంగా దేశంలో మత శక్తులను పెంచి పోషిస్తున్నారు. అర్బన్ నక్సల్స్ పేరుతో అభ్యుదయవాదుల్ని, పౌర హక్కుల నేతల్ని అరెస్టు చేసి జైల్లో నిర్భందించారు. ఎవరైనా ఇదేమని అడిగితే..'ఆందోళన్‌జీవి' అంటూ ప్రధాని మోడీ ఎదురుదాడికి దిగుతున్నారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకకత్వం, వాక్ స్వాతంత్య్రానికి భంగం వాటిల్లేలా ప్రధాని మోడీ వ్యవహరించారని, రాజ్యాం గంలో పేర్కొన్న బాధ్యతల్ని ఆయన నెరవేర్చటంలో విఫలమయ్యారనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. మాస్కో పర్యటన(2015లో) ఓ వైపు భారత జాతీయ గీతం వినిపిస్తున్నా..పట్టించుకోకుండా ప్రధాని మోడీ నడుచుకుంటూ వెళ్లారు. రష్యాలో తనను ఆహ్వానించిన వారితో ముచ్చటిస్తూ గడిపారు. జాతిపిత మహాత్మాగాంధీపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు అవాకులు, చెవాకులు పేలితే ప్రధాని అడ్డు చెప్పలేదు. నాథూరాం గాడ్సేను కీర్తిస్తున్న బీజేపీ నోళ్లకు మూత వేయలేదు. భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన 387మంది 'మప్పిలా యోధుల' పేర్లను తొలగించాలని మోడీ సర్కార్ నిర్ణయించింది.
సమాఖ్య స్ఫూర్తి ఏది...!
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం. దేశ సమగ్రత, ఐక్యత బలోపేతం కావాలాంటే సమాఖ్యస్ఫూర్తిని పెంపొందించాలని రాజ్యాంగం ప్రత్యేకంగా పేర్కొన్నది. దీనిని పూర్తిగా దెబ్బతీస్తూ రాష్ట్రాల హక్కుల్ని హరించటమే లక్ష్యంగా మోడీ సర్కార్ పాలన కొనసాగుతోంది. చివరికి 'కోవిడ్-19' సంక్షోభానికి సైతం మతం రంగు పులమడానికి కేంద్రం ప్రయత్నించింది. కోవిడ్‌పై యుద్ధాన్ని ప్రకటించామని ఏకపక్షంగా లాక్డౌన్ ప్రకటించింది. రెండో వేవ్‌లో వైరస్ విజృంభిస్తుంటే..ప్రజల ప్రాణాలు టపటపా రాలిపోతుంటే ప్రధానిగా మోడీ తీసుకున్న చర్యలు శూన్యం. ఆయన నాయకత్వ వైఫల్యం వల్లే లక్షలాది పౌరుల ప్రాణాలు పోయాయి. రెండో వేవ్ ఉధృతంగా ఉన్న సమయాన..ఢిల్లీ నడిబొడ్డున కార్పొరేట్ల కోసం 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు.