Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా ఉధృతి
- 3.37 లక్షల మందికి సోకిన మహమ్మారి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఒమిక్రాన్ కేసులు సైతం 10 వేలు దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం 19,60,954 పరీక్షలు చేపట్టగా.. 3.37 లక్షల కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కన్నా 2.7శాతం తక్కువ. గడిచిన 24గంటల్లో 488 మంది కోవిడ్‌కు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.89 కోట్లను దాటగా, 4,88,884 మరణాలు చోటుచేసుకున్నాయి. గడిచిన 24గంటల్లో 2,42,676 కోలుకోగా.. మొత్తం మీద 3.63 కోట్ల మంది కరోనాను జయించారు. ప్రస్తుతం దేశంలో 21.13 కోట్ల యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసులు 10,050కి చేరుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 67,49,746 డోసులు పంపిణీ చేయగా.. మొత్తం వ్యాక్సిన్ల వినియోగం 1,61,16,60,078కి చేరుకున్నాయి.
కోవిడ్ నుండి కోలుకున్న
మూ నెలల తర్వాతే బూస్టర్
పరీక్షలో కరోనా ఉన్నట్టుతేలి.. కోలుకున్న మూడు నెలల తర్వాత బూస్టర్ డోస్ అందించాలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఈ విషయాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాష్ శీల్ లేఖ రాశారు. కోవిడ్ అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులైన వ్యక్తులకు ప్రికాషన్ డోసు అందించే విషయంపై మార్గ నిర్దేశాల గురించి వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. 'వ్యక్తులకు ల్యాబ్ పరీక్షలో కోవిడ్ ఉన్నట్టు నిర్ధారణైతే... కోలుకున్న మూడు నెలల తర్వాతే ప్రికాషన్ డోసుతో సహా అన్ని కోవిడ్ వ్యాక్సిన్లను అందించాలి అని తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు.