Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. రాష్టంలోని 40 స్థానాలకుగాను 36 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను వెల్లడించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి పార్టీ ఫిరాయిస్తే మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఘటనలు కాంగ్రెస్‌కి నష్టం కలిగించాయని గుర్తుచేశారు. 2017లో 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపారు.