Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : దేశంలోనే అత్యంత పొడుగైన వ్యక్తిగా పేరుగాంచిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్.. సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆయన ఎత్తు 2.4 మీటర్లు (8.1 అడుగులు). ప్రపంచ రికార్డుకు 11 సెంటీమీటర్లు తక్కువ. ధర్మేంద్ర పార్టీలోకి చేరినట్లు ఎస్పీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ ప్రకటించారు. ఎస్పీ విధానాలు, అఖిలేశ్ నాయకత్వం నచ్చి ప్రతాప్ఘర్కు చెందిన ధర్మేంద్ర ఎస్పీలో చేరారని అన్నారు. ధర్మేంధ్ర తన ఎత్తుతో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని, అదేవిధంగా ఆయనను సెలబ్రిటీలా చూస్తున్నారని చెప్పారు. తన ఎత్తు వల్లే తాను పాపులర్ అయినట్టు ధర్మేంద్ర పేర్కొన్నారు.