Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలి
- అది..బీజేపీ ప్రభుత్వ కనీస బాధ్యత : ఐరాస మాజీ సలహాదారు జాన్ మెండెజ్
- లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పిలుపు
న్యూఢిల్లీ : భారత్లో మైనార్టీ ముస్లింలు, క్రిస్టి యన్లను లక్ష్యంగా చేసుకొని హిందూత్వ సంస్థల నాయకులు చేస్తున్న విద్వేష ప్రసంగాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్వేష ప్రసం గాలపై మోడీసర్కార్ మౌనం వహించటాన్ని దేశవిదేశాల్లోని పలు వురు ప్రముఖులు తప్పు బడుతున్నారు. మైనా ర్టీల పై విద్వేషాన్ని వెళ్లగక్కిన వారిపై భారత్ చర్యలు తీసుకోవాలని, ఇది మోడీ సర్కార్ కనీస బాధ్యత అని ఐక్యరాజ్యసమితి (ఐరాస) మాజీ సలహాదారు జాన్ మెండెజ్ అన్నారు. ''భారత చట్టాల ప్రకారం నిందితు లపై విచారణ జరిపి, మైనార్టీలకు రక్షణ కల్పించా ల్సిన బాధ్యత మోడీ సర్కార్పైన ఉంది. నరమేధం, మానవ హననంపై ఐరాస తీర్మానాలను ఉల్లంఘించ రాదు'' అని ఆయన చెప్పారు. ప్రముఖ వార్తా సంస్థ 'అల్ జజీరా'కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
వాటికి అడ్డుకట్ట వేయాలి..
మానవ హననం, నరమేధంపై ఐరాస తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాల్ని ప్రభుత్వాలు అమలుజేయాలి. భారత్లో మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా వస్తున్న విద్వేష ప్రసంగాలు చాలా ప్రమాదకరం. వీటికి అడ్డుకట్ట వేయకపోతే కొంతమంది సీరియస్గా తీసుకొని నరమేధానికి పాల్పడే ప్రమాదముంది. విద్వేష ప్రసంగాలు చేసిన వారికి వాక్ స్వాతంత్య్రంతో రక్షణ కల్పించరాదు. ఒక మతానికి చెందినవారిని చంపాలని పిలుపునివ్వటం, బెదిరించటం తీవ్రమైన నేరం. దీనిపై మోడీ సర్కార్ చర్యలు చేపట్టకపోతే..అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలి.
మైనార్టీలపై వివక్ష
మోడీ నేతృత్వంలోని కేంద్రం మైనార్టీలకు వ్యతిరేకమైన విధానాల్ని అమలుజేస్తోంది. వారిపట్ల వివక్ష చూపుతోంది. దీనికి కొనసాగింపుగానే నేడు భారత్లో విద్వేష ప్రసంగాలు వెలువడుతున్నాయి. అటుపై ఇది హింసకు దారితీస్తుంది. ఆ తర్వాత జాతి హననానికి, నరమేధంగా మారుతుంది. భారత్లో నెలకొన్న పరిస్థితులపై ఐరాస సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలి, మానవ హక్కుల కౌన్సిల్ స్పందించాలి. మైనార్టీలకు మోడీ సర్కార్ రక్షణ కల్పించటంలో విఫలమైతే ఐరాస భద్రతా మండలి రంగంలోకి దిగాల్సి ఉంటుంది.
8వ స్టేజీలో ఉంది..
అమెరికాకు చెందిన హక్కుల సంస్థ 'జినోసైడ్ వాచ్' భారత్లో నెలకొన్న మత ఉద్రిక్తతలపై దృష్టిసారించింది. నరమేధం, మానవ హననానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఆర్గనైజేషన్ లలో 'జినోసైడ్ వాచ్' ముఖ్యమైంది. దీని అభిప్రా యాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఆయా దేశాల్లో నరమేధం ఏ స్థాయిలో ఉందో ఈ సంస్థ ఒక సూచిక విడుదల చేస్తుంది. నరమేధం సంభవించే ప్రమాదముందని రూపొందించిన 10 స్టేజీల సూచికలో ఇప్పుడు భారత్ 8వ స్టేజీలో ఉందని 'జినోసైడ్ వాచ్' ఫౌండర్ జార్జ్ స్టాంటన్ తెలిపాడు.