Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడి కుటుంబం
- ప్రధాని, హౌంమంత్రికి లేఖలు రాసినా మారని పరిస్థితి...
శ్రీరాంపూర్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున దేశమంతా సంబురాలు చేసుకున్నారు. ఎన్నడూ నేతాజీ పేరును ప్రస్తావించని ప్రధాని మోడీ..ఎన్నికలు రాగానే నేతాజీ విగ్రహాన్ని ఢిల్లీ గడ్డపై పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. అయితే నేతాజీతో పనిచేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడు ఖితీజ్ చంద్ర రారు కుటుంబం పరిస్థితి కడుదయనీయంగా మారింది. ఖితిజ్ చంద్ర దాస్ హుగ్లీలోని శ్రీరామ్‌పూర్‌లో నివసించారు. బ్రిటిష్ వారితో నేరుగా పోరాడి, ఢాకాలోని ఒక జైలులో 18 నెలల చిత్రహింసలు అనుభవించారు. ఇపుడు ఖితీజ్ చంద్ర కుటుంబం పేదరికంతో పోరాడుతోంది. ఒక కచ్చా ఇల్లే నివాసం. శ్రీరాంపూర్‌లోని మహేష్ కాలనీలోని ఈ రెండు గదుల ఇంట్లో ఖితీజ్ చంద్రరారు కుటుంబం నివసిస్తోంది.రారు తన తల్లిని విడిచిపెట్టి స్వాతంత్య్ర పోరాటానికి దిగాడు. ఇప్పుడు అతని కుటుంబానికి అండగా నిలుస్తామన్న వారు కనుచూపుమేర కనిపించటంలేదు. రెండు గదుల వెదురుతో కట్టిన ఇల్లు శిధిలావస్థకు చేరుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా వచ్చే రూ.3 వేలు పింఛనుతో వీరి కుటుంబం జీవిస్తోంది. ఖితీజ్ చంద్ర రారుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాయం కోసం ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్ షాలకు లేఖ రాసినా వారికి బతుకులు మారలేదు. ఇప్పటికీ ఖితీజ్ చంద్ర రారు భార్య జర్నా ,ఇద్దరు కుమారులు అభిజీత్-అపూర్వ ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.
నేతాజీతో కలిసి 18 నెలలు జైలు జీవితం
ఖితీజ్ చంద్రరారు తన కాలంలో చాలా మంది విప్లవకారులకు సన్నిహితుడు. 1978లో బ్రిటిష్ ప్రభుత్వానికి సూటిగా సవాలు విసిరిన చిట్టగాంగ్ ఆయుధాల దోపిడీ వీరుడు గణేష్ ఘోష్ ఇంటికి వచ్చారు. జైప్రకాష్ నారాయణ్, సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ , అమియో బోస్ దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అతని సహచరులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఖితీజ్ చంద్రను ఢాకాలోని ఛత్తాగ్రామ్ జైలులో 18 నెలల పాటు ఖైదు చేశారు. ఇది 1942వ సంవత్సరం. 18 నెలల తర్వాత, అతను ఆంగ్ల సైనికుల కండ్లలో దుమ్ము రేపుతూ జైలు నుంచి తప్పించుకున్నాడు. 1946లో కోల్‌కతా నుంచి మళ్లీ అరెస్టు చేసి అలీపూర్ సెంట్రల్ జైలులో ఉంచారు.
తన తండ్రి ఖితీజ్ చంద్ర రారు 1920లో జన్మించాడనీ, చిన్న వయసులోనే దేశానికి అంకితమయ్యారని తనయుడు అభిజిత్ రారు వివరించాడు. స్వాతంత్య్ర పోరాటం కోసం.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారని తెలిపారు. దేశంకోసం ఇంతగా తెగువ చూపిన ఖితీజ్ కుటుంబానికి కేంద్రం నుంచి సహాయం కోసం ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం దక్కలేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి నెలా 3 వేల రూపాయలతోనే బతుకుతున్నాం.కుమారులు అభిజీత్, అపూర్వ సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు అభ్యర్థించారని ఆయన భార్య జర్నా రారు చెప్పారు. హౌంమంత్రి అమిత్ షాకు పలుమార్లు లేఖలు రాశారు. ఇంత జరిగినా ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు.ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని ఆ కుటుంబం విన్నవించింది.