Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి ఘన నివాళి అర్పించారు. ఆయన 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ''నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛా భారతదేశం, ఆజాద్ హింద్ ఆలోచనకు, తన తీవ్రమైన నిబద్ధతను నెరవేర్చడానికి నేతాజీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆయనను జాతీయ చిహ్నంగా మార్చాయి. ఆయన ఆదర్శాలు, త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది'' అని ఆయన ట్వీట్ చేశారు. గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కొనియా డారు. ఏ దేశమైనా తన పౌరుల కృషి, పరాక్రమం తోనే బలంగా తయారవుతుందని, ఏండ్లుగా భారతీ యుల్లో నిద్రాణమై ఉన్న శక్తిని జాతీయవాదం మేల్కొ ల్పిందని అభివర్ణించారు. బోస్ అసమాన ధైర్యం, నిస్వార్థ దేశసేవను స్మరించుకుంటూ ఆయన జయం తిని పరాక్రమ్ దివస్ జరుపుకొంటున్నట్టు గుర్తు చేశారు.
నేతాజీ జయంతి సందర్బంగా 75వ గణతంత్ర ఉత్సవాలు కూడా ఆదివారం నాడే ప్రారం భమయ్యారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమం లో ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. నేతాజీ పటం వద్ద ప్రధాని మోడీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఇండియా గేట్ వద్ద నేతాజీ హౌలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఏదైనా సాధించగలమనే నేతాజీ నినాదాన్ని ప్రేరణగా తీసుకోవాలని అన్నారు. మన దేశానికి ఆయన చేసిన స్మారక సహకారానికి ప్రతి భారతీయుడు గర్విస్తాడు'' అని పేర్కొన్నారు.